Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the LORD:

And he shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers, lest I come and smite the earth with a curse.

Malachi 4:5

Please Check.
Mat  11:13-15
Mat  17:10-13
Mat    9:11-13
Luk    1:16-17
John   1:19-23
 
 
 

 

 

దేవుడు సామాన్యతయందు తననుతాను మరుగుచేసుకుని పిదప సామాన్యతలో తనను బయలుపరచుకొనుట

     దేవుడు ఆయన కార్యములన్నియు సామాన్యులు అర్థము చేసుకొనులాగున ఎంతో సామాన్యముగా చేసియున్నడు

     సామాన్యులతో తనను తాను తగ్గించుకుని సామాన్యునిగా మారినాడు.

        నోవాహు దినములను మనము గమనించెదము.నోవాహు దినములలో ప్రపంచజ్ఞానమునకు అధికముగా ప్రాముఖ్యత ఇవ్వబడుటయు,ఆ జ్ఞానము గౌరవింపబడుటయును దేవుడు చూచెను.ఉదాహరణకు:

                 ఐగుప్తులో పిరమిడ్ లను మరియు స్పింక్స్ లను మహాగొప్ప కట్టడములను కట్టిరి.మరి అటువంటి కట్టడములు కట్టుటకు ఇప్పుడు ఆ జ్ఞానము లేదు.ఆనాడు సుగంధద్రవ్యములతో సిద్దపరచిన శరీరములు ఈనాటికి చెక్కుచెదరకయున్నవి. ఈరోజు మనము మమ్మీలను చేయలేము.4 లేక 5వేల సం"వరకు వర్ణము పోని రంగులు వారు కలిగియుండిరి.ఆ రంగులు నేటీకిని చెదరక అట్లే యున్నవి.ఈ రోజులలో అటువంటివి లేవు.

             కావున ఆరోజులలో గొప్ప ఆర్థికసంపదలు నిండినవారి క్రమములో ఆయన చదువులేని పామరుడను,వ్యవసాయకుడును,గొర్రెలు మేపువాడైన నోవాహు అను వ్యక్తిని ఎన్నుకొనెను.

 నోవాహు చాలా సామాన్యమైన వర్తమానము జనులకు ఇచ్చెను.వారు ఉన్నతవిద్యావంతులైనందున ఆసామాన్యతకు వారు తొట్రిల్లిరి.వారి విజ్ఞానము మధ్యలో ఆ వర్తమానము తీవ్రవాదముగానున్నది.పైన నీరే లేనప్పుడు ఆకాశములో వర్షము ఎట్లుండును?సతడు ఒక పిచ్చివానిగా ఎంచబడెను.దేవుని జనులందరును వింత మనుష్యులే.నేటి నవీన నాగరికతకు వేరు విధముగా ఉందురు.వారు వింతగాను అపరిచితులుగా ఉందురు.

      ఆత్మసంబంధమగు యాజకులుగాను, రాజరికసమూహముగాను,ఆత్మీయబలులు దేవునికి అర్పించుచు,వారి పెదవుల ఫలములైన స్తుతులను ఆయన యొక్క నామమునకు అర్పించుదురు

నోవాహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. సామాన్య గొఱ్ఱెల కాపరి దేవుడు వర్షము క్రియునని చెప్పిన మాట నమ్మెను. విజ్ఞానులు పైన వర్షము లేదని విజ్ఞాన రీతిగా నిరూపించగలరు. కానీ నోవాహు దృశ్యమగు దానిని చూచుట లేదు. విశ్వాసము పైననే తన దృష్టి నిలిపెను.
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఋజువునైయున్నది అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయుచున్నట్లుగా, విశ్వాసము చివరిగా దేవుని వాక్యము పైననే నిలచును. అక్కడే తన విశ్రాంతి స్థానమును కనుగొనును.
దేవుడైన యెహోవా తనయొక్క వాక్యములో దాగియున్నాడు. ప్రజలను రక్షించుట ద్వారా మరియు సామాన్య వర్తమానమును నెరవేర్చుట ద్వారా ఆయన మాటలను లేదా ఆయన వాక్యమును నమ్ము జనులకు ఆయన తనను తాను తెలియపరచుకొనెను.
నోవాహు యొక్క సామాన్యమైన వర్తమానమును దేవుడు నెరవేరు లాగున చేసెను.
దేవుడు సామాన్యతయందు ఏవిధముగా దాగియుండెనో కయీను మరియు హేబేలు జీవితములను ఒకసారి పరిశీలించెదము.
కయీను ప్రీతిపరచుటకు అతడు బలిపీఠమును చక్కగా అలంకరించెను. కయీను తను కట్టిన బలిపీఠమును చాలా అందముగా కట్టెను . మరియు అతడు "నేను యదార్థముగా ఉన్నంతవరకూ ఏమిచేసినా ఫరవాలేదు." అని అతడు అనుకొనెను. కాని అది భేదమును కల్గించెను. అతడు బలిపీఠమును కట్టి అందులో పుష్పములను ఉంచెను. చక్కటి ఫలములతో నింపెను. పరిశుద్ధుడు, పవిత్రుడును, గొప్పవాడైన దేవుడు ఆబలిని అంగీకరించునని తలచెను. కానీ.... దేవుడు ఆబలిని లక్ష్యపెట్టలేదు.
హేబేలు ప్రత్యక్షతద్వారా, విశ్వాసము ద్వారా శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. మనుష్య రీతిగా చెప్పవలెనంటే హేబేలు అర్పించినబలి చూచుటకు ఏమాత్రమును మంచిగా కనబడుటలేదు. హేబేలు ఆ గొఱ్ఱెపిల్లమెడపట్టి దాని చుట్టూ తాడును కట్టి బలిపీఠమువరకు దానిని ఈడ్చుకుని వచ్చియుండెను. మరియు దానిని బలిపీఠముపై పరుండబెట్టి గొంతు కోయగా దాని రక్తమును బలిపీఠముపై, హేబేలుపై చిందిస్తూ, అరుస్తూ చనిపోవును. అది భయంకరమైన దృశ్యము. మనుష్య మనస్సు తో దానిని తలంచినయెడల అది ఒక వెర్రివలె కనబడుచున్నది.
హేబేలు తన తల్లి రక్తము ద్వారా తన తండ్రి రక్తము ద్వారా పుట్టియుండేనని ఎరిగి యుండెను. పతనము కలిగించునది రక్తమే. కావున దాని పరిహారము రక్తమే అను ఒక సామన్యమైన విషయము అతనికి బయలూపరచబడెను.
దేవుడు సామన్యతలో ఏవిధముగా దాగియుండెనో మరియు సామాన్యవ్యక్తుల ద్వారా ఏవిధముగా తన వాక్యమును ప్రచురపరచెనో ఏలియా మరియు బాప్తిస్మమిచ్చు యోహాను జీవితముల ద్వారా గ్రహించెదము.
సామాన్య వ్యక్తిలో తనను మరుగు పరచుకొనుటకు దేవుడు ఏలియాను ఎన్నుకొనెను. ఏలియా దినములలో బోధకులు, యాజకులు ఉండిరి. గొప్ప రాజులును ఉండిరి. అయినను దేవుడు సామాన్య వ్యక్తిలో మరుగుపరచుకొనెను. అతడు ప్రపంచములో పేరు ప్రఖ్యతులు గలవాడు కాడు, గొప్ప సైనిక బలము అతమ్నికి లేదు, కనీసం అతని తల్లి తండ్రుల్;ఉ ఎవరో మనకు తెలియదు. అయినను దేవుడు అతనిని ఎన్నుకొనెను.
ఒక సాధారణ వ్యయసాయకుడు ప్రవక్తగా ఉండు ఉద్దేశ్యమునకై అతడు లేపబడెను. అరణ్యములో దేవుయ్డతనిని ఉంచెను. ఈ సామాన్య మానవునిలో దేవుడు అతని వెనుకనుండి ఒక మానవ శరీరములో మరుగుపరచుకొనెను. అయితే ఏలియా ఒక వెఱ్ఱివానిగా ఎంచబడెను.
ఏలియా తనను తాను తగ్గించుకుని దేవుని వాక్యముతో నిలిచి యున్నందున, ఏలియా నుండి ఆ ఆత్మను తీసి అక్కడనుండి మూడు సార్లు మరల పంపించుట దేవునికి ప్రీతిగా నుండెను. అడవి మనుష్యునిపై ఉన్న ఆత్మను దేవుడు ప్రేమించెను. ఏలియా వాక్యమునకు అంత విధేయతగానున్నందున "ఏలియా దీనిని చేయుము" అని చెప్పగలిగెను.
పలువురి ద్వారా నిరాకరింపబడి, వెలివేయబడి, హేళన చేయబడి, అందరిచే నవ్వులు పాలగునట్లు అతని జీవితములో దేవుడు అనుమతించెను. అయితే నిజమైన పరీక్ష సమయము వచ్చినప్పు డుదేవుడు అతని ప్రక్కన నిలబడి ఆసామాన్యతలో తనను నిరూపించుకొనెను.
 

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీయొద్దకుపంపుదును| నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. మలాకి 4:5-6

            

 www.studyoutsideindia.com