Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the LORD:

And he shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers, lest I come and smite the earth with a curse.

Malachi 4:5

Please Check.
Mat  11:13-15
Mat  17:10-13
Mat    9:11-13
Luk    1:16-17
John   1:19-23
 
 
 

 వాక్యానుసారమైన బాప్తీస్మము

Download in Pdf  Format    (Right Click & Save Target As)

Get Adobe Acrobat

In order to read the Adobe PDF formatted files, Adobe Acrobat Reader must be downloaded and installed. This program allows files saved in the Adobe Acrobat format to be viewed without having the language supported by your computer. Click here to obtain your free copy.

 క్రీస్తునందు ప్రియ సహోదరి,సహోదరులార ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయచున్నాము.ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుధ్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెనని పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. యూదా. 1:3. 

పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు బాప్తిస్మమును గూర్చి చాలా ప్రాముఖ్యమైన సంగతులు వ్రాయబడి యున్నవి. అయితే కొందరు బాప్తీస్మమును చులకనగాను, నిర్లక్ష్యముగాను చూచుచున్నారు. కొందరు బాప్తీస్మము అక్కరలేదు అంటున్నారు. ఈనాడు అనేక క్రైస్తవ సంఘ శాఖలు దేవుని వాఖ్యమునకు విరుద్ధమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. కొందరు చిలకరించుట, జెండా క్రింద, ఫోనుల ద్వారా, నొసలుపై నీరు పోయుట ద్వారా, మూడు సార్లు ముంచుట ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను బిరుదుల ద్వారా, బాప్తీస్మములు ఇచ్చుచున్నారు.  ఇట్టి బాప్తీస్మములు మానవ కల్పితములు.
బాప్తీస్మము అనగా: 


రోమా పత్రిక 6:1-9; వచనముల ప్రకారము.
యేసుతో కూడా సిలువ వేయబడుట.
యేసుతో కూడా చనిపోవుట.
యేసుతో కూడా సమాధి చేయబడుట.
యేసుతో కూడా తిరిగి లేచుట.

మరియు


దేవుని నీతి నెరవేర్చుట         మత్తయి. 3:4-5;
దేవుని సంకల్పము అంగీకరించుట     లూకా.7:30;
దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట. మత్తయి. 28:20;

బైబిల్ గ్రంథమునందు బాప్తిస్మము ఒక్కటే అని వ్రాయబడి యున్నది. ఎఫెసీ. 4:5;

ఎవనివలనను రక్షణ కలగదు. యేసు క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింది మనుష్యులలో ఈయబడిన మరేనామమున రక్షణ పొందలేము. అ|| కార్యములు. 4:12, మనము రక్షింపబడాలి అంటే మన పాపము క్షమింపబడాలి గనుక మనము మారు మనసు పొంది, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన పరిశిద్ధ రక్తమును చిందించి యున్నాడని విశ్వసించి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతీవాడు యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు అని వ్రాయబడి యున్నది. అ|| కార్యములు 2:38.
 
గనుక ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు పొందిన బాప్తీస్మము వాక్యానుసారమైనదేనా? లేక మానవ కల్పిత సిద్ధంతములైన పెళ్ళి బాప్తీస్మము, చిన్న పిల్లల బాఫ్తీస్మము చిలకరింపు బాప్తీస్మము, మారు మనస్సు లేకుండా బాప్తీస్మము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిరుదుల బాప్తీస్మము లేక జెండా క్రింద బాప్తీస్మమ? బైబిల్ గ్రంథములో పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గాక వేరొక బాప్తీస్మము లేదు. గనుక త్రిత్వ బోధలు, మానవ కల్పిత సిద్ధాంతములు, మత శాఖల ఆచారములు విడిచి నిజ వాఖ్య సత్యమును అంగీకరించి, వాక్యాను సారముగా జీవించి పరలోకమునకు సిద్ధపడుము. యేసు క్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వాఖ్య వధువువుగా పెండ్లికుమారుడైన యేసు క్రీస్తును ఎదుర్కొనుటకు పరిశుద్ధాత్మతో నింపబడిన బుద్ధిగల కన్యకగా నీ దివిటీని సిద్ధపరచుకొనుము. మత్తయి 25:4; దేవుడు తన వాక్య ప్రత్యక్షతను మీకు అనుగ్రహించును గాక!
వాక్యానుసారమైన బాప్తీస్మమునకు వాక్య ఋజువులు.

అపొస్తులుల కార్యములు.    2:38
                                        8:14-16
                                      10:48
                                      19:1-5
                                      22:16
గలతి:                             3:27
రోమా:                            6:3-6

వాక్యానుసారము కాని బాప్తీస్మము:

త్రిత్వ బాప్తీస్మము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో.

త్రిత్వములో బాప్తీస్మము ఇచ్చినట్లుగాని,తీసుకున్నట్లుగానీ, పరిశుద్ధ గ్రంథములో ఒక్క ఋజువు కూడా లేదు. త్రిత్వము అను మాట గానీ, త్రియేక దేవుడు అను మాట గానీ బైబిల్ గ్రంథములో ఎక్కడా లేదు.

సందేహముల కొరకు :  revelationofjesus@gmail.com

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీయొద్దకుపంపుదును| నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. మలాకి 4:5-6