|
యేడవ
దూత
పలుకు
దినములలో
అతడు
బూర
ఊదబోవుచుండగా,
దేవుడు
తన
దాసులగు
ప్రవక్తలకు
తెలిపిన
సువార్త
ప్రకారము
దేవుని
మర్మము
సమాప్తమగునని
చెప్పెను.
ప్రకటన:
10:7
ప్రకటన 1 వ అధ్యాయము
యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన
ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత
ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహనుకు వాటిని సూచించెను .
అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును
గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన
వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులోవ్రాయబడిన సంగతులను
గైకొనువారును ధన్యులు.
యోహాను ఆసియాలో ఉన్న యేడు సంఘములకు
శుభమని చెప్పి వ్రాయునది.
వర్తమాన భూతభవిష్యత్కాలములలో
ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు:
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది
సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు
నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక.
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన
పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును
యుగయుగములును కలుగునుగాక. ఆమేన్.
ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక
రాజ్యముగాను యాజకులనుగాను జేచెను.
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు;
ప్రతీ నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు;
భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన
భూతభవిష్యత్కాలములలో ఉండువాడను నేనే. అని సర్వాధికారియు
దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు
శ్రమలోను సహనములోను రాజ్యములోను పాలివాడునైన యోహానను నేను
దేవును వాక్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును యేసుని
గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు దీపమున పరవాసినైతిని.
ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా బూర
ధ్వని వంటి గొప్ప స్వరము-నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి,
ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్థీస్, ఫిలదెల్ఫియ,
లవొదికయ అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నావెనుక వింటిని.
ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో ఆని చూడ తిరిగితిని.
తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంబములను, ఆ
దీప స్తంబముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని
చూచితిని.ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును
ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకుని యుండెను.
ఆయన తలయు తలవెండ్రుకలను తెల్లని ఉన్నిని
పొలినవై హిమమంత ధవళముగా ఉండెను.ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె
ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో
సమానమై యుండెను,ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె
ఉండెను.
ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని యుండెను; ఆయన నోట
నుండి రెండంచులుగల వాడుయైన ఖడ్గమొకటి బయలు వెడలు చుండెను. ఆయన
ముఖము మహా తేజస్సు తో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.
నేనాయనను చూడగానే చచ్చిన వానివలె ఆయన
పాదములయొద్ద. ఆయన తన కుడి చేతిని న మీద ఉంచి నాతో ఇట్లనెను.
నేను మొదటివాడును కడపటివాడను
జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు
సజీవుడనైయున్నాను.మరియు మరణముయొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు
చెవులు నా స్వాధీనములో ఉన్నవి.
కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని,
వీటివెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడిచేతిలో నేవు చూచిన యేడు
నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణదీప స్తంభముల
సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు యేడు సంఘములకు దూతలు. ఆ
యేడు దీప స్తంభములు ఏడు సంఘములు.
|